విద్యార్థులు విద్య ద్వారా సమాజానికి సహకారం అందించాలనే లక్ష్యంతో ఉండాలి - SIO తన క్యాంపస్ ప్రచారాన్ని ప్రారంభించింది: "అధ్యయనం - పోరాటం - సేవ"

వర్గం రాష్ట్రం
సెప్టెంబర్ 1, 2022

ఒక విద్యార్థి తన జీవితంలో దాదాపు సంవత్సరాలు పాటు విద్యను అర్జిస్తూ గడుపుతాడు. ఆపై జీవితాంతం వాని స్వయం మరియు కుటుంబ అవసరాలు, కోరికలను నెరవేర్చడానికి గడుపుతాడు. ఇది జీవితం అయితే తినడం విద్యాభ్యాసం చేయడం సంతానం పొందడం మరియు చనిపోవడం అప్పుడు వాని జీవితములో మరియు జంతువు జీవితంలో ఒకే ఒక తేడా మిగులుతుంది అది విద్యాభ్యాసం. మానవులు సృష్టికి ప్రతిరూపం ఎందుకంటే వారికి జ్ఞానాన్ని సంపాదించి తప్పు , ఉప్పు మధ్య తేడాను చూసే సామర్థ్యం వస్తూంది. చాలా ఆధునిక విద్యా విధానం ఉన్నప్పటికీ విద్యార్థులు మంచి మానవ్వులుగా ఎదగలేక పోతున్నారు. ఈ వ్యవస్థ నిజంగా విద్యను అందించడం లేదు కేవలం విద్యార్థులను కార్మికులుగా మారుస్తుంది. విద్యా అంటే ప్రజలను అక్షరాసులుగా చేయడమే కాదు జీవితం యొక్క వాస్తవికతను మరియు దాని ఉద్దేశాన్ని అర్థం చేసుకోగల వ్యక్తులను తయారు చెయ్యడం. ఈ సవాలును పరీక్షించడానికి స్టూడెంట్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా SIO స్టేట్ తెలంగాణ అధ్యాయనం- పోరాటం- సేవ అనే థీమ్ తో పది రోజుల క్యాంపెయిన్ ప్రారంభించింది.

విద్యార్థులు మరియు యువకులు తమ ఎంచుకున్న రంగంలో కృషిచేసి తద్వారా సామాజిక అభివృద్ధికి దోహ పడాలి ఇది ఈ ప్రచారం యొక్క లక్ష్యం ఒకరి విద్యా మరియు పోరాటం యొక్క ప్రభావం అంతిమంగా మానవాళికి ప్రయోజనంగా మారాలి విద్యా, పర్యావరణం, సామాజిక ఆర్థిక సంక్షేమం, పరిశోధన మొదలైన అనేక డొమెన్స్ లో నిజాయితీతో కూడిన సహకారం అవసరం. విద్యార్థులు, యువకులు తమ ప్రతిభ మరియు ఆసక్తులను గుర్తించి స్వచ్ఛందంగా సహకారం అందించడానికి వివిధ రంగాలను చేపట్టాలి. అందరూ కలిసి చేసినప్పుడు సహకారం పెద్దగా మరియు ప్రభావంతంగా మారుతుంది.

ఈ సందర్భంగా SIO రాష్ట్రవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నారు రాష్ట్రంలో ఫీల్డ్ రీసెర్చ్ సర్వే, సెమినార్ డిబేట్ మరియు వ్యాసరచన పోటీలు ఫోటోగ్రఫీ రీల్ వంటి నూతనమైన పోటీలో ఎస్ అయ్యో నిర్వహించబోతుంది.

Read full concept note: Concept Note

Competition posters:

0 Comments

Telugu

Subscribe To Our Newsletter

Join our mailing list to receive the latest news and updates from our team.

You have Successfully Subscribed!